![]() |
![]() |

ఆల్కాహాల్ , స్మోకింగ్ ఇవన్నీ డేంజరస్ అడిక్షన్స్ అని కానీ ఎవరు ఎందుకు మెన్షన్ చేయరు ఇవన్నీ అన్నింటికంటే డేంజరస్ అని.. ఎందుకంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం బట్టి మీ మొత్తం మూడ్ డిసైడ్ అవుతుంది. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో, అభిమానిస్తావో వారికి నిన్ను హర్ట్ చేసే ఆయుధాన్నిచ్చినట్టే.. నీ కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకు.. అందరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే నీకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకు.. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని బిగ్ బాస్ సుదీప తన ఇన్ స్ట్రాగ్రామ్ లో చెప్పుకొచ్చింది.
పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప.. బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.
అయితే బిగ్ బాస్ సీజన్-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీతో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సుదీప తన భర్తతో కలిసి ఖతర్ లో ఎంజాయ్ చేస్తోంది. అయితే అక్కడ సముద్రంలో షిప్ లో ఒంటరిగా వెళ్తు ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో ఎవరిని నీకన్నా ఎక్కువగా ప్రేమించకని చెప్పుకొచ్చింది సుదీప.
![]() |
![]() |